Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

ఆత్మవాన్ భవ

ఓం శ్రీ గురుభ్యో నమః 

Athmavaan%20bhava%20rgbసాక్షాత్ భగవత్ స్వరూపుడైన వేద వ్యాస మహర్షి ఉపనిషత్తుల సారమైన శ్రీమద్భగవద్గీత ను భగవంతుని  మాటగా మానవాళికి నభూతో నభవిష్యతి అనునట్లు మహోన్నతమైన కానుకగా అందించారు.దుఃఖానికి ఆలవాలమైన సంసారమనే జనన మరణ చక్రము నుండి బయట పడి శాశ్వతమైన సచ్చిదానంద స్వరూపాన్ని పొందటానికి కావలసిన జ్ఞానాన్ని సమగ్రంగా కేవలము 700 శ్లోకాలలో అనితర సాధ్యంగా పొందుపరచి, మానవ జన్మ సఫలం చేసుకోవాలనుకొనే ముముక్షువులకొరకు అందించారు.  సరిగా అర్థం చేసుకొన్నప్పుడు  ఆచరణ సులభమై, ఆచరణతో జీవన్ముక్తావస్థ శీఘ్రమే ప్రాప్తిస్తుందని రూడి పరుస్తున్న యోగ శాస్త్రం శ్రీమద్భగవద్గీత. ఐతే మహత్తరమైన బ్రహ్మవిద్యను తేట తెల్లంగా వివరించడం కేవలం బహు భాషా పాండిత్యం వల్ల సాధ్యమయ్యే పనిగాదు. అందువల్లనేమో వివిధ రీతుల వ్యాఖ్యానాలతో లభిస్తున్న వేలకొలది గీతా గ్రంధాలు ఇహ, పరలోక సౌఖ్యాల నాశిస్తున్న వారికి ఉపయోగపడుతుండ వచ్చునేమో గాని ముముక్షువులకు తగినంత ప్రయోజనకరంగా లేవన్నది నిష్టుర సత్యం. అందువలన ముముక్షువులు గీతాధ్యయనము కొరకు గ్రంధస్తమై లభిస్తున్న పండితుల వ్యాఖ్యానాలపై సంపూర్ణముగా నాధార పడక మహత్తరమైన జీవన్ముక్తావస్థను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న, సమర్థులైన సద్గురుదేవుల అనుగ్రహ దివ్య ప్రవచనముల ద్వారా శ్రీమద్భగవద్గీతా హృదయమును అర్థం చేసుకొని అట్టి మహాత్ములను సర్వశ్య శరణాగతితో నాశ్రయించి వారి కృపకు పాత్రులై తరింప గలరు.

Read more: ఆత్మవాన్ భవ

Page 8 of 8