Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

దుఃఖానికి పరిష్కారం

ఓం శ్రీ గురుభ్యో నమః 
 

 

118

ఆధ్యాత్మికత ఎందుకు వచ్చిందంటే - మనిషి ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండాలనుకోవటం వల్ల. తానూ తనవాళ్ళూ ఎప్పుడూ సుఖంగా శాంతిగా వుండటం కోసం మనిషి నిరంతరం ఆరాటపడుతుంటాడు. ఎల్లప్పుడూ కేవలం అందుకోసమే ప్రయత్నిస్తుంటాడు. ఏ ఆలోచన చేసినా, ఏ పనిచేసినా అది కాక మరో కారణం ఉండనే వుండదు. సుఖ శాంతుల కోసం మనిషి తనకు చాతనైనంత వరకు ఎన్నో ఏర్పాట్లు చేసుకొంటూవున్నాడు. ఆ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎంతో శ్రమ, బాధ పడుతూనే వున్నాడు. ఐనా జీవితంలో ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ అశాంతీ, అలజడీ, దుఃఖమూ, భయమూ, విసుగూ ఎదురౌతూనే వున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటని చూసినట్లయితే ఈ క్రింది నాలుగు విషయాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

  • మార్పు
  • మరణం
  • ప్రతికూలత
  • ఊహలు

ఈ నాలిగిటి వల్ల మనిషి అశాంతితో, అలజడితో, విసుగుతో, బాధతో, భయంతో ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో చివరికి మృత్యువు ఒడిలోకి జారి పోతుంటాడు. సామాన్యమైన వ్యక్తులంతా ఈ వూబిలో పడిపోయి వుంటారు.

Read more: దుఃఖానికి పరిష్కారం

పరమ ధర్మం

ఓం శ్రీ గురుభ్యో నమః


33శుభం కలగాలని అందరూ ఆకాంక్షిస్తుంటారు. కానీ, శుభం అంటే ఏమిటో అది ఎలా కలుగుతుందో తెలుసుకొని ఆచరించే వారికి తప్పక శుభం కలుగుతుంది. ఎ ధర్మం ఆచరిస్తే జీవితం సుఖంగా శాంతిగా మంగళకరంగా వుంటుందో అదే శుభము అనబడుతుంది. శుభము అంటే ధర్మము! శుభము అంటే పవిత్రత!! శుభము అంటే జ్ఞానము!!!

శ్రీమద్భగవద్గీత లో 


కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్చామిత్వాం ధర్మ సమ్మూడ చేతాః !
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నమ్         2వ అ./7

అజ్ఞానంతో ధర్మమేదో తెలియజాలని కడు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాను. నాయందు దయతో నాకు శ్రేయస్కరమైనదేదో తెలిపి నన్ను శాసించమని శిష్యుడినై అర్థిస్తున్నాను.

Read more: పరమ ధర్మం

పాపము నుండి బయట పడాలంటే

ఓం శ్రీ గురుభ్యో నమః 

97

 పాపము అనే మాటకు అర్థం ఏమిటి అని మనం నిశితంగా చూడాలనుకున్నప్పుడు:

సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ !
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి !       2వ అ./38

సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములు కలుగుచున్నప్పుడు మనస్సులో తదనుగుణ సంతోష, దుఃఖాది  వికారములు తలెత్తకుండా కుండా అడ్డుకుంటూ మనస్సు యొక్క సమస్థితి (శాంతి) ని కాపాడు కున్నప్పుడు పాపము పొందకుండుదువు.

Read more: పాపము నుండి బయట పడాలంటే

శుభాకాంక్షలు

ఓం శ్రీ గురుభ్యో నమః

14

నూతన సంవత్సరం వచ్చిందంటే ఎంతోమంది తమ మిత్రులకు, కుటుంబ సభ్యులకు,ఇరుగు పొరుగు వారికి, తమ తోటి ఉద్యోగస్తులకు, తోటి ప్రయాణీకులకు, యజమానులకు, పనివారికి, పరిచయస్తులకు, ఒకోసారి ఎ పరిచయమూ లేనివారికి సైతం కేవలం ఎదురుపడినంత మాత్రానికే శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు. ఇలా పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవటం పరిచయస్థులలొ సుహ్రుత్భావ వాతావరణం పెంపొందిస్తుంది. కొత్త పరిచయాలకీ దారి తీస్తుంది. ఐతే ఈ సుహ్రుత్భావ వాతావరణం, కొత్త పరిచయాలు ఎలా పరిణమిస్తున్నాయి అని చూసినట్లయితే ఎక్కువమంది మరుసటి రోజునుండే మీరెవరో మేమెవరమో అన్నట్లుగానే ఉంటున్నారు. కొందరైతే సంవత్సరం పొడవునా ప్రతి రోజూ ఒకర్నొకరు చూసుకుంటూ కూడా కనీసం చిరునవ్వుతో పలకరించుకోకుండా ఉంటున్నా కొత్త సంవత్సరం మొదటి రోజున ఎంతో ఆప్యాయత కనబరుస్తూ శుభాకాంక్షలు చెప్పుకొంటారు. కాని మర్నాటినుండి మళ్ళీ మామూలే, ఎ పరిచయమూ లేని వాళ్ళ లాగానే జీవిస్తుంటారు. ఎంతో కొంత సమయాన్నీ, శక్తినీ, ధనాన్నీ ధారపోస్తూ ఈ శుభాకాంక్షలు అసలు ఎందుకు చెప్పుకొంటున్నట్లు? మొక్కుబడిగానా అన్న సందేహం కొట్టి పారేయలేనిదే. దీని వలన చెప్పినవారికి గాని, చెప్పించుకొన్న వారికిగాని ఏమి ప్రయోజనం కలుగుతున్నది? నిజంగా ఎ ప్రయోజనాన్ని ఆశించి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు?

Read more: శుభాకాంక్షలు