Web 07

    Facebook  Ic Smm Twitter 16  Image  SoundCloud  YouTube  This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

The views expressed by the members  are their personal interpretation and perception inspired by Sri bhavaghni guruji's wisdom talks 

Voice of Members - Venkataprasad

ఓం శ్రీ గురుభ్యోనమః 

భవఘ్నిలొ  నా   నడక 

                                     సమర్థసద్గురువు  శ్రీశ్రీశ్రీ  భవఘ్ని గురుదేవులవారి  కృపతో,   యధార్దంగా  నేను  ఎవరిని  ?   దేహం  కాదు  దేహిని  అత్మస్వరూపుడిని  అని తెలుసుకున్నాను.     ఆ   సద్గురు  ఎంతో దయతొ,   నాకు  మహామంత్రాన్ని  ఉపదేశింసి,   అనంతమైన  శాశ్వతమైన  ఏకైక  పరమాత్మ  గురించి  భోధిస్తూ,  అనంతమైన  ఆ   తత్వంతో  ఎకమవ్వటానికి   బ్రహ్మజ్ఞ్ఞానాన్ని  ఉపదేశిస్తున్నారు.      ఈ   బ్రహ్మ జ్ఞ్నానాన్ని  శ్రద్ధగా  ఆచరిస్తూ,  అత్మభావనతో  ఉండమన్నారు.

 ఇలా  అత్మభావనతో  ఉండగా   ఇంకా   భావన  ఏమిటి  ?    నువ్వు   అత్మస్వరుపుడివైతే .   సహజంగా వుండు   అన్నారు.   దీనికి  గురుదేవులవారు  ఎప్పుడూ  ఒక  ఉదాహరణ  చెపుతూవుంటారు .   స్త్రీ   తన  సహజత్వాన్ని  ఎల్లవేళలా  ఎటువంటి  పరిస్తితిలోనైనా  సరే ,    తన  ప్రవర్తనతో  ఎలా  సహజంగా  మసులుకుంటుందో ,  అలా  సహజంగా  ఉండాలి  అన్నారు .    అత్మభావనతో  వుండటమే  కాకుండా,  సహజత్వంతో  ఉండటమనేది  అద్యాత్మికమార్గంలో   గొప్ప  మలుపు .   ఈ   మలుపు  అనంతమైన  పరమాత్మ  తత్వంతో  ఎకమయ్యేటట్టు  చేస్తుంది .    ఇంతటి   జ్ఞానసంపద / బ్రహ్మజ్ఞానం  ప్రసాదిస్తున్న  ఆ   గురుస్వరూపానికి / బొధస్వరూపానికి   శిరస్సు  వంచి  కృతజ్ఞతలతో   అనేక  నమస్కారములు  తెలయజేయటం  తప్ప  ఏమి  చెయ్యగలను .   ఈ  ప్రపంచంలో  నాకు  ఇంతటి  సంపద భవఘ్ని మర్మయోగ  విద్యాలయంలో  సమర్థసద్గురువు  ఎంతో కరుణతో ప్రసాదిస్తున్నారు .  ఎన్నో జన్మల పుణ్యఫలం  వుంటేగాని అంతటి సమర్థసద్గురువు సన్నిధికి  చేరలేము .  మోక్షమార్గానికి  ద్వారం  ఈ  భవఘ్ని మర్మయోగ  విద్యాలయం.   ఇది  నా  ఆనుభవం .

  నేను  భవఘ్నిలొకి  రాకముందు  శ్రీరాముడు  అంటే నాకు ఎంతో ఇష్టం .  శ్రీరామనవమి వచ్చిందటే సీతారాములవారి  కల్యాణానికి ,సంబందిత  కార్యక్రమాలకు ఇష్టంగా హాజరయ్యేవాడిని .
 4-4-2010 న  భవఘ్నిలొకి  వచ్చాక, అనేక సత్సంగాలలో సద్గురువు బోధనలు వింటూ,అనంతమైన ఏకైక పరమాత్మ తత్వం గురించి తెలుసుకుంటూ వుండగా, ఒకనాడు ఒక సత్సంగంలో యదార్ధమైన

రామతత్వం గురించి గురుబోధ :   శ్రీరామపట్టాభిషేకం తర్వాత సీతాదేవి ఆంజనేయస్వామికి యదార్ధమైన రామతత్వం గురించి బోధించటం|   'ఆంజనేయా`  రాముడు అంటే కనిపిస్తున్న ఈ దేహమే రాముడు అనుకుంటున్నావు.  నిరాకారుడు నిర్వికారుడు అవ్యయుడు ఐనటువంటి పరంధాముడే యదార్ధమైన రాముడు అంతేకాని కనిపిస్తున్న ఈ దేహం కాదు. నాశనమయ్యే ఈ రూపాన్నికాక,యదార్ధమైన అవ్యయడైన శ్రీరాముడిని/అత్మతత్వాన్ని పట్టుకోవడమే రామభక్తి.

 ఆ  సద్గురువు బోధ అనంతంగా అలా సాగిపోతునేవుంది. ఈ పరమ రహస్యాలను సమర్ధసద్గురువు తప్ప ఇంకెవరు బోధించగలరు?  ప్రతి సత్సంగంలోను అనేకానేక బ్రహ్మ రహస్యాలను తెలియజేసి,అనంతమైన ఏకైక పరమాత్మతో ఎలా ఏకం కావాలో బోధిస్తున్నారు.

 మనకు పండుగలు చాలా వున్నాయి. సద్గురువు బోధతో శ్రీరామనవమి అంటే ఏమిటో తెలుసుకుని,ఆత్మచింతనతో ఇంతకు ముందు కంటే బాగా పవిత్రంగా వుంటానికి కుదిరింది.    (రామతత్వం  CDs ).   అలాగే మహాశివరాత్రి పండుగ  'శివలింగం '   :లింగం అంటే గుర్తు చేసేది .శివాయ అంటే శుభకరమైనధి. ఓం  శివాయ అని అనంతమైన దృష్టితో వుండాలి అన్నారు.

నరకచతుర్దసి/దీపావళి  :   నరకాసురుడు అంటే మనలోని అసురభావనలే.  వాటిని చంపటమే నరకచతుర్దసి.  దైవీసంపధతో వుండి యధార్థమైన స్వస్వరూపానన్దాన్ని పొందమన్నారు.    విజయదశమి అంటే దైవీసంపద పెంచుకుని విజయం సాధించు అన్నారు.  స్తితప్రజ్ఞతతొ వుంటే  విజయం నీదే .    ప్రతిరోజూ  విజయదశమే  అన్నారు . సంక్రాంతి   ( సం =బాగా ;   క్రాంతి =ప్రకాశము /వెలుగు ).  అన్నింటిని ప్రకాశింప చేస్తున్న అనంతమైన చైతన్యస్వరూపుడిని నిరంతరం స్మరించటమే భక్తి అనబడుతుంది.  

 ఇలా పండుగల యొక్క అంతరార్తాన్ని మనకు భోదించి, వాటిని ఆచరిస్తూ వాటి విశిష్టతను మన పిల్లలకు అందించమన్నారు.  ఇది సాంప్రదాయం.  ఇదే భారతీయ సంస్క్రతి అన్నారు.  ప్రతి పండుగ అద్భుతమైన రీతిలొ,అత్మచింతనతో వుంటూ, గురుదేవులవారు బోధిస్తున్న యజ్ఞదాన తపోకర్మలు చేస్తూవుంటే  మోక్షమార్గం అంటే  భవఘ్నిమార్గం అనేది  అనుభవపూర్వకంగా  నేను తెలుసుకున్న సత్యమార్గం .

 సెప్టెంబర్  2012   నేను హైదరాబాద్ నుండి  విశాఖపట్నంకు   ఫ్యామిలీ  shift అయ్యాను.  సత్సంగాలకు ఇంతకుముందులాగా క్రమం తప్పకుండా హజరవ్వలెకపొతున్నాను.   భవఘ్ని  CDs   నేను  ఆత్మచింతనతో  వుంటానికి ఎంతో  ఉపయోగపడుతున్నాయి.   CDs  మళ్లీ  మళ్లీ  వినటంవల్ల, దూరంగావున్నామనే  భావన లేకుండా, సద్గురువు బోధను  CDs  ద్వారా  వింటూ,  నిరాకారపరబ్రహ్మ స్వరూపాన్ని స్మరించుకోవటానికి, అత్మచింతనలో వుండటానికి ఈ  CDs  ఎంతో  ఉపయోగపడుతున్నాయి .
23-12-2012   గీతా జయంతికి  హనుమాన్ జంక్షన్లో  మహాశాంతియజ్ఞంలో  పరమ పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ,  లోకా సమస్తా సుఖినో భవంతు  అనే శాంతిమంత్రంతో, విశ్వశాంతిని  కాం  స్షిస్తూ,  అందరూ  ఆ  పరమశాంతిని  పొందాలి  అని కోరుకోమన్నారు  శాంతిస్వరుపులైన  సమర్థసద్గురువు .
 జీవితంలో  ఎన్నో  సంవత్సరాలు  గడిచిపోయాయి.  కేవలం  రెండున్నర్ర   సంవత్షారాలలోనే  భవఘ్నిలోకి  వచ్చినాక నాలో  అద్యాత్మకంగా  ఎంతో  మార్పు  వచ్చింది .   అత్మచింతనతో పాటు ,  లోకమంతా  సుఖంగా  శాంతిగా  వుండాలనే   ఆకాంస్ఖ   ఏర్పడింది .   
                                ఇంతటి  జ్ఞానాన్ని ,  సంపద  ప్రసాదిస్తున్న  శ్రీశ్రీశ్రీ   భవఘ్ని గురుదేవులవారి   పాదపద్మములకు  కృతజ్ఞతలతో  అనేకానేక  నమస్కారములు  తెలియజేసుకుంటూ ,

                                   గురుదేవులవారి  అనుగ్రహం  కోరుకుంటూ   .  .  .   .   .

 

                                                                                          ప్రసాదరావు  మల్లిపెద్ది 
                                                                                విశాఖపట్నం 
                                                     
                                                                                     భవఘ్ని శిష్యుడు 

 

ఓం  శ్రీ గురుభ్యో  నమః

   
  శ్రీ వ్యాస భగవానుడి జయంతి సందర్భంగా ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జంక్షన్, జ్ఞాన మందిరం లో భవఘ్ని సభ్యులమందరము "శ్రీ భవఘ్ని గురుదేవుల" వారి అనుగ్రహంతో గురు పౌర్ణిమ మహోత్సవము జరుపుకుని జీవితాన్ని దన్యం చేసుకున్నాం.

పరంపరాగతంగా వున్న సద్గురుదేవులఅందరిని అనంత గురు తత్వ రూపంలో ఆరాధించి వారందరి అనుగ్రహ, ఆశీర్వాదములు నిండుగా పొంది దివ్యమైన అనుభూతి పొంది ధన్యులమైనాము. 

గురు అంటే  చీకటిని  పారద్రోలేవాడు.ఎన్నో  జన్మల బంధం  ఉండబట్టే , మనం  సమర్ధ  సద్గురువు  సన్నిధికి  రాగలిగాము.  ఆ  గురువర్యులు మన పట్ల  ఎంతో కరుణతో,  మనలో  వున్న అసురభావనలు పోగొట్టి , సద్భావన  ఆత్మదృష్టి  కలుగచేస్తున్నారు .  ఇంతటి మహాభాగ్యం అందుకుంటున్న  మనందరం  ఎంతో  అదృష్టవంతులం .  ఈ  విధంగా  అత్మభావనతో  దివ్యానుభూతిని  అనుభవిస్తున్న  మనం  ఆ  గురుదేవులవార్ని ఏమని  వర్నించగలం?  అంతటి  శక్తిమంతుడిని .

  జీవితంలో తెలుసుకోవల్చిన  బ్రహ్మవిద్య  గురించి గురువర్యులు  ద్వారా  తెలుచుకున్తున్నాము .  మనం ఆ  పరమాత్మయొక్క అంశ  అని ,  అత్మస్వరూపలమని .   మన  జీవితాన్ని  ఎలా  సద్వినియోగం  చేసుకోవాలో  చెప్పి,  మోక్షమార్గాన్ని  చూపిస్తున్నారు  ఆ  కరుణామయుడు, బొధస్వరూపుడు .     భవఘ్నిమార్గంలోకి  రాకపోయివుంటే  మన పరిస్థితి  ఏమిటి ?     84  లక్షల  జీవరాసులలో  మానవజన్మ  తప్ప ,  అన్నీ హీన  జన్మలే  కదా !   అప్పుడు  ఎంత  నష్టం .    జీవితంలో ఎంత  నష్టమైనా  భరించవచ్చోమో గాని  జీవితాన్ని  నష్టపో గూడదు .అందుకని   సమర్ధ  సద్గురువు  బోధకు తగట్టుగా  ట్యూన్ అయి  ఆచరిస్తే  ఈ జన్మతోనే  మోక్షం  పొందవచ్చు .

అలాగే  మనం  ఏకాగ్రతతోవుంటే  ప్రశాంతత  కల్గి , అది మన ఇంటి వాతావరణం  దగ్గరనుండి  ప్రపంచశాంతికి  దారితీస్తుంది .  దాని కోసమే  Peace for all global organisation  ఆవిర్భవించింది . గురుదేవులవారి  అశీస్శులతొ ,   లోకకల్యాణం  కోసం ,  ప్రపంచశాంతి  కోసం  సద్గురువులు ఇలా  కోరుకుంటూ ,  మానవాళి శ్రేయస్సుకు  ప్రయత్నం  చేస్తూవుంటారు .

కొంతమంది  గురువులకు హంగు ,ఆర్భాటం  ఎక్కువ .   ఎంత  జనం  వుంటే  అంత  గొప్ప .     సమర్ధ  సద్గురువులు  వీటికి  దూరంగా  సాదాసీదాగా  వుంటారు .   జనం కోసం చూడరు .   ప్రాపంచిక సుఖాలకు  దూరంగా  వుంటూ ,  యదార్ధమైన  భగవత్ స్వరూపాన్ని ,  ఆ  ఏకైక  పరమాత్మ గురించి  జ్ఞాన్నాన్ని  మానవాళికి అందిస్తున్నారు .

అటువంటి  పరమసత్యాన్ని  జ్ఞాన్నాన్ని  దివ్యానుభూతిని  ప్రసాదిస్తున్న  పరమపూజ్యులైన  శ్రీ  శ్రీ  శ్రీ   భవఘ్ని సమర్ధ  సద్గురువు  వారి    పాద పద్మములకు  శిరస్సు వంచి  నమస్కరిస్తూ  అనేకానేక 

కృతజ్ఞతలతో,  గురుదేవులవారి అనుగ్రహం  కోరుకుంటూ   .   .    .   . 

 

                                                                                      ప్రసాదరావు  మల్లిపెద్ది 
                                                                                విశాఖపట్నం 
                                                     
                                                                                      భవఘ్ని శిష్యుడు 

 

Voice of Members - MSC Bose

1) శాంతిగా ఉండటం!
2) అందరూ శాంతిగా ఉండాలని కోరుకోవటం!
3) అందరూ శాంతిగా ఉండటానికి సహకరించటం!
4) ఎవరి శాంతికీ భంగం కలిగించకుండా ఉండటం!

మహాత్ములైన శ్రీ భవఘ్ని గురు దేవుల అడుగు జాడలలో నడుస్తున్న భవఘ్ని సభ్యులందరికీ ఇది జీవిత లక్ష్యం.

అతి సాధారణంగా కన్పిస్తున్న పై నాలుగు విషయాలను సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం.

శాంతిగా ఉండటం అంటే ఏమిటి?
ఏ అలజడీ, దుఖ్ఖమూ లేకుండా ఉండటం అని అందరూ అనుకొనే విషయమే. ఈ స్థితి ఎన్నో సమయాలలో అందరికీ అనుభవమైనదే. ఐతే అన్ని సమయాలలోనూ అలా ఉండటం ఎలా అన్నదే సమస్య. జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సమస్యలు ఎదురౌతుంటాయి.

కొన్ని తనకు తానుగా కొనితెచ్చుకొనే సమస్యలు (ఆధ్యాత్మికము).
 తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగకపోవడం, తనది అనుకొన్నది తనకు దూరమవడం, తన ఆధీనంలో ఉంటున్నది తనకు ఇష్టం లేని విధంగా మారడం, తన దేహెంద్రియాలు సైతం తన అధీనంలో ఉండకపోవడం మొదలైన ఎన్నో సమస్యలు.

కొన్ని ఇతర జీవులవల్ల, లేక ఇతర వస్తువులవల్ల, లేక పరిస్థితులవల్ల ఏర్పడే సమస్యలు (అధిబౌతికము).
దుర్మార్గుల వలన కలిగే బాధలు,అవమానాలు, దొంగలు, మోసగాళ్ళ వలన కలిగే నష్టాలు, క్రూర జంతువుల వలన ప్రమాదాలు, ప్రతికూల వాతావరణం మూలంగా వచ్చే సమస్యలు, కాలుష్యాల వలన కలిగే ఆరోగ్య సమస్యలు,

కొన్ని ఊహకందని పరిణామాల వల్ల ఏర్పడే సమస్యలు (అధిదైవికము)
భూకంపాలు, అఘ్నిపర్వత విస్పొటనాలు, మొదలగు ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే కష్ట, నష్టాలు, ప్రమాదాలు, దురదృష్టకర పరిణామాలతో కలిగే కష్ట, నష్టాలు మొదలైనవి.
 ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అన్ని సందర్భాలలోనూ శాంతిగా ఉండగలగాలి.
ఇదే శాంతిగా ఉండటం అంటే.
సాధారణమైన జీవితాన్ని గడిపే వారికి ఇది సాధ్యమేనా? సాధారణంగా ఎంతోమంది తాము శాంతిగా వుండటం కోసం ఇతరుల శాంతికి భంగం కలిగిస్తూ వుంటారు. తమకే ఉపయోగమూ లేకపోయినా ఇతరుల శాంతిని భంగపరచే వారున్న నేటి సమాజంలో తాము శాంతిగా ఉంటూ, అందరి శాంతినీ కోరుకుంటూ, అందరి శాంతికీ సహకరిస్తూ, ఎవరి శాంతినీ భంగ పరచ కుండా జీవించడం సాధ్యమేనా?
ఇది సాధ్యమే అని భారత జాతి గర్వించే విధంగా మన పూర్వీకులు తమ అనుభవాలతో కాచి వడపోసిన అత్యున్నత విలువలతో కూడిన జీవన విధానాన్నిఆధునిక ప్రపంచ మానవాళికి అందిన అతి గొప్పవైన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి.

అటువంటి జీవన విధానం ఆచరించే వారికి పూర్ణ సంత్రుప్తికరంగాను, పరమానంద దాయకంగాను ఉండడమే కాకుండా, వారి అనుపానులలో నున్న యావన్మందికి శాంతిని చెకూర్చేదిగా వుంటున్నదని సామాజిక చరిత్రలో ఎన్నో ఉదంతాలు సూచిస్తున్నాయి. కానీ,అతి నిగూఢమైన అట్టి జీవన విధానం అందరూ సునాయాసంగా గ్రహించే టట్లు లేదు. ఐతే అట్టి జీవన విధానాన్ని ఆచరిస్తున్న అనుభవజ్ఞులలో ప్రజ్ఞావంతులైన మహాత్ములు ఆచరణ సంసిద్ధులైన వారికి బహు ఉదారంతో శాస్త్రానుగుణంగా విశదపరుస్తున్నారు.

కడు దుర్లభమైన అట్టి మహాత్ముల కోవలో "శ్రీ శ్రీ శ్రీ భవఘ్ని గురుదేవులవారు"  తెలుగు వారి పాలిట పెన్నిధిగా గలరు. అపార కరుణా మయులైన ఆ సద్గురు దేవుల అనుగ్రహంతో వేల కొలది భవఘ్ని సభ్యులు  అత్యున్నతమైన ఆ జీవన విధానాన్ని అలవారచుకోడానికి సమాయుత్తులౌతున్నారు. ఇప్పటికే వారిలో ఎంతోమంది కొద్దిపాటి సాధనతోనే ఆ శాంతి ఛాయలను అనుభవిస్తున్నారు. మహత్తరమైన ఆ పరమ శాంతిని సంపూర్ణంగా పొందాలని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతున్నారు.

క్రొత్తగా భవఘ్ని సభ్యులు కాదలచిన వారికి ఉండవలసిన అర్హతలు:
1) అనసూయత్వము (సత్యాన్ని గ్రహించడానికి సంసిద్ధత)
2) శాస్త్రముల పట్ల, సత్పురుషుల పట్ల ప్రేమ, గౌరవము
3) శ్రద్ధ, వినమ్రత 
4) శ్రీ భవఘ్ని గురూజీ వారి సత్సంగ ప్రవచనాలను విన్న అనుభవం (సత్సంగ ప్రవచనాలు DVD రూపంలో లభిస్తున్నాయి.
5) శ్రీమద్భగవద్గీత శ్లోకములు కనీసం రెండు అధ్యాయాలైనా తెలిసి వుండాలి.
6) శాంతి జీవన సాధనకు, సత్సంగములలో పాల్గొనడానికి సంసిద్ధత.

అందరూ సుఖంగా శాంతిగా ఉండుగాక!
అందరి జీవితమూ సమృద్ధి కరంగా ఉండుగాక!
అందరి జీవితమూ మంగళ కరంగా ఉండుగాక!     
 
శ్రీ  శ్రీ  శ్రీ   భవఘ్ని గురుదేవులవారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో,నమస్కరించుకుంటూ 

గురుదేవులవారి అనుగ్రహం  కోరుకుంటూ...... 

 

 

MSC బోస్

హైదరాబాద్.

 భవఘ్ని సభ్యుడు. 

                                                                                                              

వాసనాక్షయం

ఓం శ్రీ గురుభ్యో నమః 

115మనమంతా సాధారణంగా మన స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తాము. ఈ స్వభావాన్ని బట్టే మాటలు, చేతలు, ప్రవర్తన ఉంటుంది. ఈ మాటలకు, చేతలకు మూలం ఆలోచనలే. ఈ స్వభావం  మనకు ఎలా ఏర్పడుతుంది? మనం ఏదయినా ఒక ఆలోచన చేసి, ఆ ఆలోచన ప్రకారం మాట్లాడుతూ, ఆ ప్రకారమే పనులు చేస్తూ, అదే ఆలోచన మరల మరల చేస్తూ వుంటే, అదే స్వభావంగా రూపుదిద్దుకుంటుంది. దీన్నే ఆద్యాత్మికంగా "వాసన" అంటారు.ఈ వాసనలు ఆధ్యాత్మికంగా చాలా ముక్యమయిన విషయాలు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళదాము అనుకుంటే, మనం నడిచే మార్గంలో, సరైన సాధన విధానాన్ని తీసుకొని, సరైన రీతిలో సాధన చేస్తూ, కృషి చేసినప్పుడు మాత్రమే ఈ వాసనలను మార్చుకోగలుగుతాము. లేకుంటే "వాసనాక్షయం" సాద్యం కానే కాదు. ఈ వాసనలనే సంస్కారాలు అనీ, స్వభావము అనీ అంటారు. మంచి సంస్కారాలు ఉంటే జీవితం కూడా మంచిగా ఉంటుంది. అసలు మనం సరైన సంస్కారంతో ప్రవర్తిస్తున్నామా ? లేదా? అని తెలుసుకోవాలంటే, మన శ్రేయస్సు కోరి మహాత్ములు ఏమి చెప్పారు? శాస్త్రం ఏమి చెప్పింది ? మనం ఎలా ఉండాలి ? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాలను గురించి భగవద్గీతలో  దైవాంసుర సంపత్ విభాగ యోగంలో వివరించారు.

Read more: వాసనాక్షయం

భవ రోగానికి మందు

ఓం శ్రీ గురుభ్యో నమః

119జబ్బు ఒకటి వుంది. దానికి మందు ఒకటి వుంది. ఇది ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జబ్బు వున్నది, మందు వున్నది అని చెబుతున్నవారు పెక్కుమంది  ఆ జబ్బుతో తామే బాధపడుతున్నారు గాని ఆ మందు మింగటం లేదు. జబ్బు తగ్గాలి అంటే వైద్యుని దగ్గరకు వెళ్ళాలి, వైద్యుడు సూచించిన మందును వైద్యుడు సూచించిన పథ్యంతో వేసుకోవాలి. అప్పుడు జబ్బు తప్పకుండా తగ్గుతుంది.

భవరోగం అనే జబ్బు వున్నది. పథ్యాన్ని ఆచరిస్తూ ఇదిగో ఈ మందు వేసుకుంటే నయమౌతుంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఆ మందును పథ్యంతో సహా తామే వేసుకోకుండా ఆ జబ్బుతో బాధపడుతున్నారు. మందు పేరును పదేపదే మాట్లాడుతున్నంతమాత్రాన గాని, ఆ మందును అరచేతిలో పెట్టుకొని ఇదిగో ఇదిగో అంటూ అందరికీ చెబుతున్నంతమాత్రాన గాని, పథ్యాన్ని ఎలా పాటించాలో, మందు ఎలా మింగాలో తెలిసినంత మాత్రాన గాని జబ్బు తగ్గదుగదా! ఐతే ఈ రోజున అనేకమంది తాము స్వీకరించాకుండానే మందును గురించి ప్రచారం చేస్తున్నారు. ఇది చూసి మిగిలిన వాళ్ళందరూ ఒక అయోమయ స్థితికి గురౌతున్నారు. ఐతే ఆ జబ్బును పోగొట్టుకున్నవాళ్ళు సూచించిన విధంగా పథ్యం ఆచరిస్తూ మందును స్వీకరించినట్లైతే జబ్బు తప్పకుండా నయమై తీరుతుంది.

Read more: భవ రోగానికి మందు